నారాయణపురం (వెలమకన్నే: నవంబర్: 02,
ఎల్బీనగర్ మన్సురాబాద్ ప్రాంతంలో 'ప్రజాశక్తి', 'సూర్య' దినపత్రికల విలేకరిగా సేవలందించిన సీనియర్ జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. శేఖర్ అకాల మరణం స్థానిక జర్నలిస్ట్ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
విషయం తెలుసుకున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణ సహా పలువురు జర్నలిస్ట్ నేతలు నల్గొండ జిల్లా వెలమకన్నే గ్రామంలోని శేఖర్ నివాసానికి చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళులర్పించారు.
అనంతరం శేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ. 10 వేల తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. శేఖర్ కుటుంబానికి భవిష్యత్తులో సంఘం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రెస్ అకాడమీ ద్వారా ప్రభుత్వ సహాయాన్ని త్వరితగతిన ఇప్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
శేఖర్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జే.కిషన్ (రాధా కిషన్), బోల్లంపల్లి ఆంజనేయులు, శశిపాల్ రెడ్డి, బాణాల మధుసూదనాచారి, చాపల శ్రీనివాస్, నర్రి రమేష్, దేవయ్య, దుర్గయ్య తదితరులు ఉన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి