Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

మహిళల అభివృద్ధికి మరో ముందడుగు.. సమైక్య భవనానికి భూమిపూజ

Updated : 02 Nov 2026 18:38 IST
As Preferred Source 1 min read
మహిళల అభివృద్ధికి మరో ముందడుగు.. సమైక్య భవనానికి భూమిపూజ

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని ముర్కుంజాల్ గ్రామంలో మహిళల ఐక్యత,అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం అందించేలా మహిళా సమైక్య భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి ఆదేశాలు మేరకు గ్రామ సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్, ఉపసర్పంచ్ విజయరావు పాటిల్‌తో కలిసి భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. వీబీజీ రాంజీ నిధుల ద్వారా ఈ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు కావడంతో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ మహిళలకు ప్రత్యేక భవనం అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. ఈ భవనంలో మహిళా సంఘాల సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మహిళల సమస్యలపై చర్చలు నిర్వహించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడంతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా కృషి చేస్తామని, గ్రామ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బంజా రమేష్, అంజయ్య మాదిగ, మీసాల లక్ష్మి, పెంటన్న, సీసీ అరుణ, వీవోఏ లీడర్లు రుక్మిణి, రమణి, లక్ష్మి, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ సొసైటీ డైరెక్టర్ దిగంబరావు పాటిల్, బాల్‌రెడ్డి, సాయిరెడ్డి, మైపాల్ రెడ్డి, ముదిరాజ్ గంగాధర్, కురుమ మల్గొండ, కోటగిరి పండరి, రాములు మాదిగ, గైని విట్టల్, సారంగి అభిలాష్, వేదాన్ష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల అభివృద్ధికి మరో ముందడుగు.. సమైక్య భవనానికి భూమిపూజ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి