Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కట్టు కాలువకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో వినతి

Updated : 02 Nov 2026 19:05 IST
As Preferred Source 1 min read
కట్టు కాలువకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో వినతి

మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న కట్టు కాలువ వద్ద తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు సంగేపు నరసింహారావు, చేకూరి ముత్తయ్య అధికారులను కోరారు.ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు.కాలువ పక్కనే వాహనాల రాకపోకలు అధికంగా ఉండే సీసీ రోడ్డు ఉండటంతో వాహనదారులు అదుపుతప్పి కాలువలో పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతం ప్రమాదాలకు ఆస్కారంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు, కాలువకు ఇరువైపులా రక్షణ గోడ లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలు చోటుచేసుకోకముందే అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

కట్టు కాలువకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో వినతి

Article Image

మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న కట్టు కాలువ వద్ద తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు సంగేపు నరసింహారావు, చేకూరి ముత్తయ్య అధికారులను కోరారు.ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు.కాలువ పక్కనే వాహనాల రాకపోకలు అధికంగా ఉండే సీసీ రోడ్డు ఉండటంతో వాహనదారులు అదుపుతప్పి కాలువలో పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతం ప్రమాదాలకు ఆస్కారంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు, కాలువకు ఇరువైపులా రక్షణ గోడ లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలు చోటుచేసుకోకముందే అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి