నల్లగొండ జిల్లా కొలిముంతలపాడ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జోనల్ క్రీడా పోటీల్లో మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు పూలే కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. వాలీబాల్‌లో ప్రథమ, కబడ్డీ, టెన్నికాయిట్‌లో ద్వితీయ, హైజంప్‌లో ప్రథమ, డిస్కస్ త్రోలో తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ చాటిన పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే నైపుణ్యం పెరుగుతుందని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె. శోభారాణి తెలిపారు. విజేతలను, రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను ప్రిన్సిపాల్ కె. శోభారాణి, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్. లెనిన్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రదర్శన కనబరిచి కళాశాలకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది ఆదినారాయణ, నవీన్, నరేష్, గోపాలకృష్ణ, సురేష్, అప్పారావు, రవి, శ్రీను, సుధాకర్ రెడ్డి, రవీందర్, జ్యోతి, ఫిరదోస్, రాధిక, నాగమణి, ఫ్లోరా, ప్రియాంక తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
జోనల్ స్థాయిలో ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి