Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి అందించడమే లక్ష్యం.

Updated : 18 Nov 2026 20:47 IST
As Preferred Source 1 min read
అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి అందించడమే లక్ష్యం.

అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆర్థికంగా అండగా నిలవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సర్పంచ్ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ అన్నారు. మునగాల గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా పింఛన్లు మంజూరైన 96 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను సర్పంచ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు ఎంతో తోడ్పాటునిస్తాయని, వారి రోజువారీ అవసరాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతనంగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి అందించడమే లక్ష్యం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి