Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు

Updated : 18 Nov 2026 20:47 IST
As Preferred Source 1 min read
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు

– బీబీనగర్ ఎస్‌హెచ్‌ఓ ఏ. సూర్య నాయక్

బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురు వ్యక్తులను పోలీసులు ఈరోజు భువనగిరి కోర్టులో హాజరుపరిచారు.విచారణ అనంతరం భువనగిరి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన మరో ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున జరిమానా విధించారు. దీంతో మొత్తం రూ.50,000 జరిమానా విధించడం జరిగింది.ఈ సందర్భంగా బీబీనగర్ ఎస్‌హెచ్‌ఓ ఏ. సూర్య నాయక్ మాట్లాడుతూ, ఇప్పటివరకు బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 40 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో న్యాయస్థానం ద్వారా సుమారు రూ.4 లక్షల జరిమానా విధించబడిందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలకే కాకుండా, రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని తెలిపారు.ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు పోలీసులకు సహకరించి ప్రమాదరహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని బీబీనగర్ పోలీసులు కోరారు.

Sthanikam

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి