విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించిన సీఐ నందగిరి వెంకటేష్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ పట్టణంలోని విశాల భారతి పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నందగిరి వెంకటేష్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుకు ఎడమవైపు మాత్రమే నడవాలని, రోడ్డు దాటేటప్పుడు ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్ వద్దే దాటాలని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే కార్లు (ఫోర్ వీలర్స్) నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. తాము నేర్చుకున్న రోడ్డు భద్రత నియమాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా తెలియజేసి, అందరూ పాటించేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్‌ఐ, ఎస్సై, పోలీస్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి