Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

పుట్టినరోజు వేడుకలో సేవా స్ఫూర్తి.. ప్రభుత్వ పాఠశాలకు కుర్చీల బహూకరణ

15-08-2026 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎలుక రాజు ఉపేందర్ చిన్న కొండూరు సిపిఎం పార్టీ నాయకులు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా సీపీఎం నాయకులు ఏలుకరాజు ఉపేందర్ చిన్నకొండూరు ప్రాథమిక పాఠశాలకు ఉచితంగా కుర్చీలను అందజేసి తన సేవా నిరతిని చాటుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా విద్యార్థులకు ఉపయోగపడేలా పాఠశాలకు అవసరమైన సామగ్రిని బహూకరించడం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు.ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అలాగే, శిథిలావస్థకు చేరిన చిన్నకొండూరు ప్రాథమిక పాఠశాల పాత భవనాన్ని తొలగించి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్యాబోధన జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. పేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్యనందిస్తున్న సర్కారు బడుల అభివృద్ధికి సమాజం బాధ్యతగా ముందుకు రావాలన్నారు.​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వేముల రమాదేవి, ఉపాధ్యాయులు కె. శిరీష, ఎ. క్రాంతి, నాయకులు మారుపాక భాస్కర్, ఎస్‌ఎంసీ చైర్మన్ గడ్డం మంజుల సత్తయ్య, చెరుకు రమేష్ గౌడ్, తిగుళ్ల బిక్షపతి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

పుట్టినరోజు వేడుకలో సేవా స్ఫూర్తి.. ప్రభుత్వ పాఠశాలకు కుర్చీల బహూకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News