రామన్నపేట:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన సూర్య ప్రభంజనం ఎడిటర్ ఎటేలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను శనివారం పత్రికా విలేకరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
స్నేహపూర్వక వాతావరణంలో వేడుకలు.
పత్రికా రంగంలో శ్రీనివాస్ చేస్తున్న సేవలను పలువురు జర్నలిస్టులు అభినందించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో స్థానికం దినపత్రిక ఎడిటర్ Dr. కొండ మల్లేశం గౌడ్, ప్రజాజ్యోతి రిపోర్టర్ లవణ ఉపేందర్, తెలంగాణ కేసరి రిపోర్టర్ జినుకల శ్రీనివాస్, తొలి అక్షరం రిపోర్టర్ నోముల శంకర్, నవభారత రిపోర్టర్ నాగటి యాదయ్య, తొలివెలుగు రిపోర్టర్ కర్నే వినయ్ తదితరులు పాల్గొని శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి