Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:03 PM

ప్రతి మోకాలి నొప్పికీ శస్త్రచికిత్స అవసరం లేదు: డాక్టర్‌ సాయి దినేష్‌

15-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోకాళ్ల నొప్పిని ‘వయసు’ అంటూ వదిలేయొద్దు!

సకాలంలో చికిత్సతో కదలికల స్వేచ్ఛను కాపాడుకోవచ్చు

నల్గొండ, స్థానికం ప్రతినిధి:

మోకాళ్ల నొప్పి వయసు పైబడటంలో సహజమేనని భావించి నిర్లక్ష్యం చేయొద్దని సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ తాటికొండ డాక్టర్‌ సాయి దినేష్‌ సూచించారు. నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర రెస్టారెంట్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌పై అవగాహన కల్పించారు.

మోకాలి కీలు అరిగిపోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్‌ వస్తుందని తెలిపారు. తొలిదశలో మెట్లు ఎక్కడం, ఎక్కువ దూరం నడవడం ఇబ్బందిగా మారుతుందని, తర్వాత కుర్చీలోంచి లేవడం, నేలపై కూర్చోవడం, షాపింగ్‌, ప్రయాణం వంటి సాధారణ పనులు కూడా కష్టంగా మారుతాయని వివరించారు. క్రమంగా ఇతరులపై ఆధారపడే పరిస్థితి రావచ్చన్నారు.

చికిత్స ఆలస్యం చేయొద్దు

తొలి దశలో బరువు నియంత్రణ, వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులు, ఇతర తగిన చికిత్సలతో నొప్పిని అదుపులో ఉంచి మోకాలి పనితీరును కాపాడుకోవచ్చని డాక్టర్‌ సాయి దినేష్‌ తెలిపారు. తీవ్రమైన నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికీ శస్త్రచికిత్స అవసరం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆర్థరైటిస్‌ తీవ్రంగా ఉండి రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు శస్త్రచికిత్సను అనవసరంగా ఏళ్ల తరబడి వాయిదా వేయకూడదన్నారు.

లక్ష్యం.. మళ్లీ స్వేచ్ఛగా నడవడమే

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స లక్ష్యం కేవలం ఎక్స్‌రేలో మోకాలి రూపాన్ని మార్చడం కాదని, నొప్పి లేకుండా నడవడం.. మెట్లు ఎక్కడం.. కుటుంబంతో కలిసి ప్రయాణించడం.. ఇతరులపై ఆధారపడకుండా రోజువారీ పనులు చేసుకోవడం వంటి స్వాతంత్ర్యాన్ని తిరిగి అందించడమేనని పేర్కొన్నారు.

మోకాళ్ల నొప్పి కారణంగా నడవడం, కూర్చోవడం, నిలబడడం, మెట్లు ఎక్కడం లేదా ప్రయాణం చేయడం ఇబ్బందిగా మారితే ఆర్థోపెడిక్‌ నిపుణుడిని సంప్రదించి సరైన నిర్ధారణ చేయించుకోవాలని సూచించారు. మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌ మీ స్వేచ్ఛను హరించాల్సిన అవసరం లేదని.. సరైన సమయంలో సరైన చికిత్సతో కదలికల స్వేచ్ఛను తిరిగి పొందవచ్చని డాక్టర్‌ సాయి దినేష్‌ తెలిపారు.

Sthanikam

ప్రతి మోకాలి నొప్పికీ శస్త్రచికిత్స అవసరం లేదు: డాక్టర్‌ సాయి దినేష్‌

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News