Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:57 PM

ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

15-08-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

8తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు మామిడి సోమయ్య ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలోని ప్రెస్‌క్లబ్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి వందనం సమర్పించారు.ఈ సందర్భంగా అంతోటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో జర్నలిస్టులు, పత్రికా రంగం కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరానికి చేరవేయడంలో పాత్రికేయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. సమాజ హితమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం ప్రెస్‌క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఐకమత్యంతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి సంఘం అండగా ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు, గుర్తింపు కార్డులు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. హక్కుల సాధన కోసం జర్నలిస్టులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సమాజ హితాన్ని కోరుతూ నిజాయితీతో కూడిన వార్తలను ప్రజలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వేములకొండ రమేష్, ఉపాధ్యక్షులు కందరబోయిన నాగకృష్ణ, కిరణ్, లింగాల రామ్మూర్తి, జాతీయ మండలి సభ్యుడు ఎలుగోటి వెంకట్, రాష్ట్ర మండలి సభ్యుడు నల్లా రాకేష్‌రెడ్డి, తెలంగాణ బీజేఎఫ్ జిల్లా కార్యదర్శి కాసోజు శ్రీధర్, వీడియో చిత్రీకరణ సంఘం అధ్యక్షుడు అమరబోయిన ఉపేందర్, నగర అధ్యక్షుడు గంటేల కుమార్, కార్యదర్శి కప్పల మధుగౌడ్, ప్రెస్‌క్లబ్ కార్యదర్శి మల్లెల శిల్ప, ఎర్ర రాజేంద్రప్రసాద్, పి.శ్రీను, వి.విజయకుమారి, బి.వీరన్న, వ్యాఖ్యాత కీర్తిజ్యోతి, బంక మధు, కిరణ్, వనం నరేష్, వాకచర్ల సురేష్, చల్లగుండ్ల సతీష్, కొండల్, షేక్ మీరా, షేక్ షబ్బీర్, మేదర నాగరాజు, చిన్నంశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News