Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:31 PM

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ వేళ సీపీఎం నేత ముందస్తు అరెస్ట్

15-08-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో నల్లగొండలో సీపీఎం నాయకుడు ఎండి సలీంను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

సీపీఎం నేత సలీంను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకు ముందే నాయకులను అదుపులోకి తీసుకోవడంపై సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వాతంత్ర్య దినోత్సవం రోజునే అరెస్టులా?

అంటూ పోలీసుల తీరును సీపీఎం నాయకులు ప్రశ్నించారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన వారు.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టు చేసినట్లు పోలీసుల వర్గాలు భావిస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై సీపీఎం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నల్లగొండలో రాజకీయ వర్గాల్లో ఈ ముందస్తు అరెస్టు చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ వేళ సీపీఎం నేత ముందస్తు అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News