Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:02 PM

ఇద్రపాలనగర్‌లో విషాదం.. స్కూల్ బస్సు కింద పడి 18 నెలల చిన్నారి మృతి

15-08-2026 509 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: రామన్నపేట మండలంలోని ఇద్రపాలనగర్ గ్రామంలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. నాగార్జున స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు TS30T5502 ఢీకొనడంతో 18 నెలల చిన్నారి అభిజ్ఞతార అక్కడికక్కడే మృతిచెందింది.

గ్రామానికి చెందిన వీర్లపల్లి మురళి–ఎల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతురాలు చిన్న కుమార్తెగా కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

స్కూల్ బస్సు కదులుతున్న సమయంలో చిన్నారి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.

Sthanikam

ఇద్రపాలనగర్‌లో విషాదం.. స్కూల్ బస్సు కింద పడి 18 నెలల చిన్నారి మృతి

Article Image

: రామన్నపేట మండలంలోని ఇద్రపాలనగర్ గ్రామంలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. నాగార్జున స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు TS30T5502 ఢీకొనడంతో 18 నెలల చిన్నారి అభిజ్ఞతార అక్కడికక్కడే మృతిచెందింది.

గ్రామానికి చెందిన వీర్లపల్లి మురళి–ఎల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతురాలు చిన్న కుమార్తెగా కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

స్కూల్ బస్సు కదులుతున్న సమయంలో చిన్నారి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News