Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:33 PM

స్వాతంత్ర్య వేడుకల వేళ.. నల్గొండలో నాకాబందీ

15-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ప్రధాన కూడళ్లు, బస్‌స్టాండ్‌, రైల్వే స్టేషన్‌, లాడ్జీలు, హోటళ్లలో విస్తృత తనిఖీలు.

నల్గొండ, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పట్టణంలో నాకాబందీ ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టింది. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌, ఐపీఎస్‌ స్వయంగా తనిఖీలను పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్టీసీ బస్‌స్టాండ్‌, రైల్వే స్టేషన్‌, లాడ్జీలు, హోటళ్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో చేపట్టిన భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. రద్దీ ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

లాడ్జీలు, హోటళ్లలో బస చేస్తున్న వారి వివరాలను పోలీసులు పరిశీలించారు. గుర్తింపు పత్రాలు, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలను తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్‌, బస్‌స్టాండ్‌లలో ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.

ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు కనిపించినప్పుడు వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీస్‌ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు.

Sthanikam

స్వాతంత్ర్య వేడుకల వేళ.. నల్గొండలో నాకాబందీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News