Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 60 శాతం దళితులకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం.......

Updated : 15 Aug 2026 05:45 IST
As Preferred Source 1 min read
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 60 శాతం దళితులకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం.......

కోదాడ పట్టణంలో పేదలకు మంజూరైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 60 శాతం ఇళ్లను దళిత కుటుంబాలకే అందజేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వంటిపులి వెంకటేష్ లు అన్నారు. 34వ వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండు ఆధ్వర్యంలో శుక్రవారం బాలాజీ నగర్ లో లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటాలకు లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. మంత్రి, ఎమ్మెల్యే చొరవతోనే కోదాడలో వందలాది పేద కుటుంబాలకు ఇళ్లు దక్కాయని కొనియాడారు.నిరుపేద దళిత కుటుంబాలకు పెద్దపీట వేసిన మంత్రి ఉత్తమ్-పద్మావతి రెడ్డి దంపతులకు దళితులు జీవితాంతం రుణపడి ఉంటారని తెలిపారు.ఈ

కార్యక్రమంలో కౌన్సిలర్స్ వంగూరి గోపి ,మాలోతు చైతన్య నాయక్, ఏసు పాదం , జిల్లేపల్లి నాగేశ్వరరావు, వంటి పులి శ్రీనివాస్ ,కాంపాటి పుల్లయ్య ,కుడుముల శ్రీను, ఏర్పుల శ్రావణ్, సిద్దెల రాంబాబు ,పగిడిపల్లి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు...........

Sthanikam

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 60 శాతం దళితులకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం.......

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news