స్థానికం, చైతన్యపురి: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన 21 ఏళ్ల యువతి కనుగంటి సాయిప్రియ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు.
న్యూ నాగోల్లోని రత్నదీప్‌లో ఉద్యోగం చేస్తున్న సాయిప్రియ ఈ నెల 13న ఉదయం విధులకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
సాయిప్రియ చిన్నాన్న కనుగంటి సంపత్ ఇచ్చిన ఫిర్యాదులో ప్రభు అనే వ్యక్తిపై అనుమానం ఉందని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
యువతి ఆచూకీ తెలిసిన వారు నాగోల్ పోలీసులకు సమాచారం అందించాలని సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి