నల్లగొండను అగ్రభాగాన నిలబెట్టడమే నా లక్ష్యం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..
పట్టణ తాగునీటి ప్రాజెక్టుకు రూ.83 కోట్లతో శంకుస్థాపన..
అదనంగా మరో రూ.300 కోట్ల అభివృద్ధి నిధుల మంజూరు..
నల్లగొండ: "నల్లగొండ అంటేనే పోరాటం, త్యాగం, తిరుగుబాటు, ఆత్మగౌరవానికి ప్రతీక నల్లగొండ నా ఊపిరి.. నా శ్వాస ఉన్నంత వరకు ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడతా" అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. నీటి కష్టాలు తీర్చి, నల్లగొండను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెడతానని ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఏనాటికీ శాశ్వతం కాదని, ప్రజల కోసం చేసే పోరాటాలు, అందించే సేవలే చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు.
సంక్షేమంలో ముందంజ..
జిల్లాలో అమలువుతున్న సంక్షేమ పథకాల పురోగతిని వివరిస్తూ..రైతు భరోసా ధ్వార జిల్లాలోని 5.35 లక్షల మంది రైతులకు రూ.715 కోట్ల నిధులను అందించినట్లు తెలిపారు. ఆసరా పింఛన్లు ను 1.99 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు రూ.51.28 కోట్ల పింఛన్ల తో చేయూతనిస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తో జిల్లాకు 17,873 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 4,360 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. గృహజ్యోతి తో 2.56 లక్షల కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుల లబ్ధి పొందుతున్నాయని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 38,403 మంది పేదలకు రూ.119.11 కోట్ల విలువైన వైద్య సేవలు అందాయని తెలిపారు.
రూ.83 కోట్లతో 24 గంటల తాగునీటి ప్రాజెక్టు..
నల్లగొండ పట్టణ ప్రజలకు 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.83 కోట్లతో చేపడుతున్న వాటర్ ప్రాజెక్టుకు మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణ రూపురేఖలు మార్చేందుకు అదనంగా మరో రూ.300 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు రూ.20 కోట్లతో ఎన్ఏసీ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మించనున్నట్లు వెల్లడించారు. పోరాటాల గడ్డగా పేరుగాంచిన నల్లగొండను అభివృద్ధికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే తన ఆశయమని మంత్రి కోమటిరెడ్డి పునరుద్ఘాటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి