Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామ్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 01:22 PM

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మండల వివరాలు వెల్లడించిన ఎమ్మార్వో లాల్ బహదూర్ శాస్త్రి

15-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఆగస్టు 15:

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రామన్నపేట మండల కేంద్రంలో ఎమ్మార్వో లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పత్రికా ప్రతినిధుల సమక్షంలో మండలానికి సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించారు.

రామన్నపేట మండలం మొత్తం 55,477 ఎకరాల భూ వైశాల్యం కలిగి ఉందని, మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు ఉన్నాయని తెలిపారు. ఇందులో 32,996 ఎకరాలు వ్యవసాయానికి యోగ్యమైన భూమి కాగా, 22,481 ఎకరాలు వ్యవసాయానికి యోగ్యం కాని భూమిగా ఉందన్నారు.

51,534 మంది జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం రామన్నపేట మండలంలో 51,534 మంది జనాభా ఉన్నట్లు తెలిపారు. ఇందులో పురుషులు 25,683 మంది, మహిళలు 25,581 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎస్సీ జనాభా 16,053 మంది, మొత్తం జనాభాలో సుమారు 31 శాతం ఉందన్నారు. ఎస్టీ జనాభా 580 మంది కాగా, బీసీ జనాభా 34,951 మంది, మొత్తం జనాభాలో 67.81 శాతంగా ఉందని వివరించారు.

2025–26 అంచనా ప్రకారం మండల జనాభా 55,476కు చేరినట్లు తెలిపారు. ఇదే కాలంలో నిర్వహించిన ఇండ్ల సర్వే ప్రకారం మండలంలో మొత్తం 17,829 ఇళ్లు ఉన్నాయని చెప్పారు.

17,464 రేషన్ కార్డులు

రామన్నపేట మండల వ్యాప్తంగా 17,464 రేషన్ కార్డులు ఉన్నాయని, ఆగస్టు వరకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం 55,325 యూనిట్లుగా ఉందని ఎమ్మార్వో తెలిపారు.

భూభారతి ద్వారా రూ.26.97 కోట్ల ఆదాయం

భూభారతి ద్వారా మండలంలో 17,029 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.26,97,29,664 ఆదాయం వచ్చినట్లు వివరించారు. మండలంలో మొత్తం 28,883 మంది పట్టాదారులు ఉండగా, ఇప్పటివరకు 18,939 పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు చెప్పారు.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం

2024 నుంచి 2026 వరకు ప్రభుత్వం 603 కళ్యాణలక్ష్మి చెక్కులు, 24 షాదీ ముబారక్ చెక్కులు అందించినట్లు తెలిపారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు.

మండలంలో ఓటరు సంబంధిత ప్రక్రియ 100 శాతం పూర్తయిందని, సుమారు 1,800 మంది మాత్రమే ఇతర ప్రాంతాల్లో తమ ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మార్వో లాల్ బహదూర్ శాస్త్రి పేర్కొన్నారు.

Sthanikam

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మండల వివరాలు వెల్లడించిన ఎమ్మార్వో లాల్ బహదూర్ శాస్త్రి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News