వజ్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో వజ్ర ఇండస్ట్రీస్ బృందంతో కలిసి 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వజ్ర ఇండస్ట్రీస్ సిబ్బంది, బృంద సభ్యులు, తదితరులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి