Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:01 PM

అంబేద్కర్‌కు అవమానం.. చినిగిన జెండాతో దేశానికి గౌరవమా?

15-08-2026 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

R&B కార్యాలయంలో గాంధీ చిత్రపటానికే మాల.. అంబేద్కర్‌ చిత్రపటాన్ని విస్మరించడంపై విమర్శలు.

గ్రంథాలయం వద్ద చినిగిన జెండా ఎగురవేత.. చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్

రామన్నపేట: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలోని R&B కార్యాలయం వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి మాల వేయకుండా కేవలం మహాత్మా గాంధీ చిత్రపటానికే మాల వేసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎండీ పజల్‌ బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబేద్కర్‌ చిత్రపటానికి గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. దేశ రాజ్యాంగ నిర్మాతకు కనీస గౌరవం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదన్నారు.

అదేవిధంగా రామన్నపేట గ్రంథాలయం వద్ద చినిగిన జాతీయ జెండాను ఎగురవేయడం దేశ జెండాను అవమానించడమేనని పజల్‌ బేగ్‌ విమర్శించారు. దేశానికి, జాతీయ జెండాకు ఇస్తున్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.

ఈ ఘటనలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల శాఖ అధ్యక్షులు ఎండీ పజల్‌ బేగ్‌ డిమాండ్‌ చేశారు.

Sthanikam

అంబేద్కర్‌కు అవమానం.. చినిగిన జెండాతో దేశానికి గౌరవమా?

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News