బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి
బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి
Prabhakar
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో దళిత సంఘం నాయకుల డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి చింతల్ బస్తీలోని మహనీయుల విగ్రహాల వద్ద ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆహ్వాన కమిటీ వారుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ పైజల్ హైమద్, అతిథులుగా మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్,ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎంఎస్ పి అధ్యక్షులు రామచంద్ర మాదిగ,
వివిధ కుల సంఘాల నాయకులు లు హాజరయ్యారు.ముందుగా మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారు. అనంతరం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ పథకాల ద్వారా అర్హులైన వారికి సంక్షేమ పథకాల పత్రాలను అందజేశారు. సందర్భంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రలను తెలుసుకోవడం కోసం వర్దంతులు జయంతులను నిర్వహిస్తారని ఒక రోజు పూలమాల వేసిన మర్చిపోకూడదని వారి యొక్క స్ఫూర్తిని తెలుసుకొని ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్ గాని బాబు జగ్జీవన్ రామ్ కానీ ఒక కులానికి ఒక మతానికో చెందిన వారు కారని అందరి ప్రజల కోసం అందరి బాగోగుల కోసం పాటుపడ్డ మహా నాయకులని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ద్వారా చేకూరుతుందో దానిని అందించడానికి ముందుంటామని, పిల్లల చదువులకు విదేశీ విద్య లాంటి ఆర్థిక సహకారానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయని వాటిని వినియోగించుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో కుల సంఘాలు చేసిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ద్వారా సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు పథకాలను అందించినప్పుడు ఎంతో సంతృప్తిని ఇస్తుందని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా నిధులు రానప్పుడు ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవసరం ప్రజాసంఘాలపైన కుల సంఘాల పైన కూడా ఉందని గుర్తు చేశారు.నియోజకవర్గ అభివృద్ధి విషయంలో సీఎం వరకు వెళ్లి నిధులు తీసుకు వస్తున్నానని ఎస్సీ,ఎస్టీ ప్రజలు వారి వారి పిల్లలను చదివించడానికి కావాల్సిన పథకాలను వినియోగించుకోవాలన్నారు.విదేశీ విద్య లాంటి వాటిని కూడా వినియోగించుకొని చదువుకోవాలని సూచించారు.ఎవరైనా అధికారులు దళితుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే వారిపై అట్రాసిటీ కేసు కూడా పెట్టడానికి దళిత సంఘాలు ముందుకు రావాలని తెలిపారు.అందరి అభివృద్ధిని కోరే నాయకుడుగా ముందుంటానని వారు చెప్పారు.ఎమ్మార్పీస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో పార్లమెంటు సభ్యుడిగా ఉండి ప్రజలకు సేవ చేసిన బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు. దళితులు పండుగలా నిర్వహించుకునే మహనీయుల జయంతులప్పుడు జిల్లా స్థాయి కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు,కలెక్టర్ అధికారులు ఈ కార్యక్రమానికి రాకపోవడం చాలా బాధాకరమని ఇలానే మరొకసారి జరిగితే ఈ అంశాలను ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకువెళ్తామని హెచ్చరించారు.ఎవరైతే మహనీయులను గౌరవించి దళిత వర్గాల సమస్యలను వినడానికి మహనీయుల కార్యక్రమాలకు హాజరవుతారో వారిని మా జాతులు గౌరవిస్తాయని మహనీయులను గౌరవించని నాయకులను దళిత జాతులు కూడా పక్కన పెడతాయని గుర్తుంచుకోవాలని కార్యక్రమాన్నికి రాకున్నా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు చురకలాంటించారు.కేశపాగ రామచందర్ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు ఎం ఎస్ పి జిల్లా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మహనీయుల జయంతులను ప్రతి జిల్లా లో అధికారులకు నిర్వహించాలంటే ముందుగా దళిత సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేసుకొని కమిటీ ఏర్పాటు చేసి కార్యక్రమాలను నిర్వహిస్తారని ఈ జిల్లాలో మాత్రం అలా కాకుండా వారి ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు అన్నారు.మల్కాజ్ గిరి గ్రామ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు ఎదిగింది కానీ మల్కాజిగిరిలో మాదిగలకు మానిటరింగ్ కమిటీలో కూడా మాదిగ సామాజిక వర్గానికి చోటు లేదని,విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో అధికారులు రాజకీయ నాయకులు ఈ విషయాలను గుర్తించాలన్నారు.ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సాహాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీరామ్ ఉపేందర్,సంధిగారి నరసింగరావు, కమిటీ సభ్యులతో పాటు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు వినోద్, రవికుమార్,మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్,గ్రంథాలయ చైర్మన్ బంగునూరి శ్రీనివాస్ రెడ్డి,అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్,ఆర్టీఏ మెంబర్ భీమిలి జైపాల్ రెడ్డి, డీవీఎంసీ సభ్యులు బిట్ల వెంకటేష్, మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీ నాయకులు,జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు,సిబ్బంది స్థానిక బస్తివాసులు కాలనీవాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి