Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:31 AM

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

25-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు, : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 129 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని క్రిష్ణగిరి మండలం ఆగవెల్లి గ్రామానికి చెందిన లింగన్న ఫిర్యాదు చేశారు. గృహ రుణం విషయంలో మోసపోయామని కోడుమూరుకు చెందిన కర్ణ గోపాల్ వినతి ఇచ్చారు. అలాగే కూరగాయల బంకు ఆక్రమణ, ట్రాక్టర్ తీసుకుని పరారైన ఘటన, ఇల్లు ఆక్రమించే ప్రయత్నం, భూమి విక్రయంలో మోసం వంటి ఫిర్యాదులు కూడా అందాయి.

ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు రామయ్య నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

Article Image

కర్నూలు, : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 129 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని క్రిష్ణగిరి మండలం ఆగవెల్లి గ్రామానికి చెందిన లింగన్న ఫిర్యాదు చేశారు. గృహ రుణం విషయంలో మోసపోయామని కోడుమూరుకు చెందిన కర్ణ గోపాల్ వినతి ఇచ్చారు. అలాగే కూరగాయల బంకు ఆక్రమణ, ట్రాక్టర్ తీసుకుని పరారైన ఘటన, ఇల్లు ఆక్రమించే ప్రయత్నం, భూమి విక్రయంలో మోసం వంటి ఫిర్యాదులు కూడా అందాయి.

ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు రామయ్య నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News