Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

16-05-2026 403 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

431 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్, మరో ఇద్దరు పరార్

రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (ఆర్‌ఎన్‌పీఎస్) బృందం, చౌటుప్పల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పంతంగి టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న TS07GM 4617 నంబర్‌ (నకిలీ నంబర్ ప్లేట్) గల మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసే సమయంలో అందులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో సుమారు 431 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 5 కిలోల చొప్పున 83 ప్యాకెట్లు, 2 కిలోల చొప్పున 8 ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల విచారణలో నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని, రాజమండ్రి ప్రాంతంలో రాకేష్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని సేకరించి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించినట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న నిందితులు సలీమ్ (34), అమన్ (22)గా గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా లిషాడి గ్రామానికి చెందినవారని తెలిపారు. కేసులో అమీర్ుద్దీన్, ఫిరోజ్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.చౌటుప్పల్ పోలీసుల సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Sthanikam

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News