Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

25-05-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండల భాచేపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పచ్చిరొట్టె జిలుగు, జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, భూసార పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి జిలుగు, జనుము వంటి పచ్చిరొట్టె పంటలను సాగు చేసి పూత దశలో భూమిలో కలియదున్నడం వల్ల భూమికి అవసరమైన నత్రజని, సేంద్రీయ కర్బనం సహజసిద్ధంగా లభించి భూసారం పెరుగుతుందని తెలిపారు. దీని వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. రాబోయే వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, రుణాలు సకాలంలో అందిస్తూ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని రైతులందరూ ఈ సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకుని సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని కోరారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్లు, వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News