Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

కల్హేర్ మండల సమాఖ్య కార్యాలయంలో బాల్య వివాహాలపై కిషోర బాలికలకు అవగాహన

26-05-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల కేంద్రంలో ఉన్న మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా స్నేహ సంఘాల సభ్యులు, కిషోర బాలికలకు బాల్య వివాహాల నివారణ మరియు మహిళా, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్హేర్ ఎస్సై రవిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. చిన్న వయస్సులో వివాహాలు చేయడం చట్ట విరుద్ధమని, అలాంటి ఘటనలు తెలిసిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.అలాగే బాలికలు విద్యపై దృష్టి పెట్టి తమ లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రభుత్వం బాలికల రక్షణ కోసం అమలు చేస్తున్న చట్టాలు, షీ టీమ్స్ సేవలు, మహిళా హెల్ప్‌లైన్, చైల్డ్ హెల్ప్‌లైన్ వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. బాలల హక్కులు, ఆరోగ్య పరిరక్షణ, సురక్షిత జీవనం వంటి అంశాలపై అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డివిజన్ షీ టీం ఇంచార్జీ ఏఎస్ఐ తులసిరాం, కానిస్టేబుల్ చాంగుబాయి, చైల్డ్ ప్రొటెక్షన్ శాఖ అధికారి విఠల్ నర్సింలు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జెబా, ఏపీఎం వంశీకృష్ణ, సీసీలు శైలూ, రాములు, సమత, కల్పన, బేబీ, అకౌంటెంట్ శోభన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలికలు అధికారులు చెప్పిన సూచనలను ఆసక్తిగా విన్నారు.

Sthanikam

కల్హేర్ మండల సమాఖ్య కార్యాలయంలో బాల్య వివాహాలపై కిషోర బాలికలకు అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News