Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:52 PM

పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ

పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ

పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ
26-05-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* రక్షకభటులకు వడదెబ్బ నివారణ మందుల పంపిణీ

* ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్

నిరంతరం ప్రజల రక్షణ కోసం ఎండనక, వాననక శ్రమించే రక్షకభటుల ఆరోగ్య సంరక్షణకు సహస్ర ఫౌండేషన్ తన వంతు సహాయం అందించిందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ అన్నారు. మంగళవారం చౌటుప్పల పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ కార్యాలయంలో డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మధ కుమార్ సమక్షంలో పోలీస్ సిబ్బందికి హోమియోపతి వడదెబ్బ నివారణ ఔషధాలను ఆయన పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవి కాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా పోలీసులు వడదెబ్బ బారిన పడకుండా ఈ మందులు ఎంతగానో తోడ్పడతాయన్నారు. ఆరోగ్యం బాగుంటేనే విధులు సక్రమంగా నిర్వహించగలరని గుర్తుచేశారు.​ ప్రస్తుత కాలంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం ఉందన్న ఆయన, సిబ్బంది అంతా ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.​ఈ కార్యక్రమంలో సహస్ర ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News