నల్లగొండ జిల్లా చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజస్థాన్‌కు చెందిన లారీ కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై, వాహనదారుడు అక్కడికక్కడే మృతి. మృతుడు నాగార్జునసాగర్ సమీపంలోని చలకుర్తి గ్రామానికి చెందిన బొల్లం లింగయ్యగా పోలీసులు గుర్తించారు.స్థానికుల వివరాల ప్రకారం, ఆర్టీవో వాహన తనిఖీలను తప్పించుకోవడానికి లారీ డ్రైవర్ వేగంగా వెళ్లే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
PRINT TIME: October 09, 2026 03:26 PM
నల్లగొండ చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

14-05-2026
310 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా చర్లపల్లి ఫ్లైఓవర్ బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజస్థాన్‌కు చెందిన లారీ కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై, వాహనదారుడు అక్కడికక్కడే మృతి. మృతుడు నాగార్జునసాగర్ సమీపంలోని చలకుర్తి గ్రామానికి చెందిన బొల్లం లింగయ్యగా పోలీసులు గుర్తించారు.స్థానికుల వివరాల ప్రకారం, ఆర్టీవో వాహన తనిఖీలను తప్పించుకోవడానికి లారీ డ్రైవర్ వేగంగా వెళ్లే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి