Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:18 PM

చేనేత పరిశ్రమ అభివృద్ధికి బీటీ రోడ్లు అవసరం. విప్ వేముల వీరేశంను కలిసిన రాపోలు నరసింహ

25-05-2026 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిరిపురం రోడ్ల అభివృద్ధికి వినతి

: పెద్దకాపర్తి నుంచి సిరిపురం వరకు, వెలిమినేడు నుంచి సిరిపురం మీదుగా ఇంద్రపాలనగరం వరకు రహదారులను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహ, నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిపురం గ్రామం దశాబ్దాలుగా చేనేత రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి కోట్ల రూపాయల విలువైన చేనేత ఉత్పత్తులు మార్కెట్‌కు చేరుతున్నప్పటికీ సరైన రహదారి సదుపాయం లేక పరిశ్రమ అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ప్రతిపాదిత రహదారులు అభివృద్ధి చెందితే సిరిపురం గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా చేనేత పరిశ్రమకు కొత్త ఊపిరి లభిస్తుందని వివరించారు. ఉపాధి అవకాశాలు పెరిగి వందలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న సిరిపురం భవిష్యత్తులో చేనేత పర్యాటక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

వినతిపత్రంపై స్పందించిన ఎమ్మెల్యే వేముల వీరేశం రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Sthanikam

చేనేత పరిశ్రమ అభివృద్ధికి బీటీ రోడ్లు అవసరం. విప్ వేముల వీరేశంను కలిసిన రాపోలు నరసింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News