Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:26 AM

పెట్రోల్‌ ధరల పెంపుపై డీవైఎఫ్‌ఐ నిరసన. బైక్‌లను నెట్టుకుంటూ వినూత్న ఆందోళన

26-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం నల్గొండలో సుభాష్‌ విగ్రహం నుంచి క్లాక్‌టవర్‌ వరకు బైక్‌లను నెట్టుకుంటూ వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా ఇంధన ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. ప్రజల ఆదాయం తగ్గుతున్న సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగినప్పుడు వెంటనే ఇంధన ధరలు పెంచుతున్న ప్రభుత్వం.. ధరలు తగ్గినప్పుడు మాత్రం ప్రజలకు ఉపశమనం కల్పించడం లేదని విమర్శించారు. రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే దశలవారీగా ధరలు పెంచడం ప్రజావ్యతిరేక చర్య అని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో కార్లపూడి రాము, మాదాసు రావణ్‌, ఎండీ అదిల్‌, శివ, సాయి, రోహిత్‌, మధు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెట్రోల్‌ ధరల పెంపుపై డీవైఎఫ్‌ఐ నిరసన. బైక్‌లను నెట్టుకుంటూ వినూత్న ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News