Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 11:09 PM

50 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ ఇవ్వాలి.

25-05-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Hyderabad
Alpha Raw

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

రామన్నపేట,

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రామన్నపేటలోని సీఐటీయూ మండల కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం జిల్లా కార్యదర్శి గొరిగే సోములు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాద బీమా, పింఛన్, ప్రసూతి సహాయం, పిల్లల విద్యా సహాయం వంటి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ మంజూరు చేయాలని, గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను సులభతరం చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు పనిలో ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని అన్నారు.

ప్రభుత్వం కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వంగాల మారయ్య, కార్యదర్శి బుడ్డ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు గాదె కృష్ణ, నాయకులు నూనె అంజయ్య, జింక కుమార్, జుంపాల మహేష్, మేడి కిరణ్, చెరుకు కిరణ్, బుడ్డ శ్రీకాంత్, కక్కిరేణి రాము, కోయపురి బిక్షం, కొల్లూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

50 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ ఇవ్వాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News