Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:20 PM

నీర్నంలలో ముందస్తు చర్యలు. మంచినీటి బోరు మరమ్మతు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ గోపాల్ రెడ్డి

25-05-2026 204 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎండాకాలంలో గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నీర్నంల గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని గోగు పాపులు బావి వద్ద ఉన్న గ్రామపంచాయతీ మంచినీటి బోరును మరమ్మతు చేయించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం, తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగించడం కోసం గ్రామపంచాయతీ కృషి చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, గ్రామపంచాయతీ సిబ్బంది ముత్యాల సాయిలు, గ్రామస్థులు ఆవుల లక్ష్మీనారాయణ, గోగు పాపులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీర్నంలలో ముందస్తు చర్యలు. మంచినీటి బోరు మరమ్మతు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ గోపాల్ రెడ్డి

Article Image

ఎండాకాలంలో గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నీర్నంల గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని గోగు పాపులు బావి వద్ద ఉన్న గ్రామపంచాయతీ మంచినీటి బోరును మరమ్మతు చేయించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం, తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగించడం కోసం గ్రామపంచాయతీ కృషి చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, గ్రామపంచాయతీ సిబ్బంది ముత్యాల సాయిలు, గ్రామస్థులు ఆవుల లక్ష్మీనారాయణ, గోగు పాపులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News