Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:31 AM

గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి. మహిళా వారోత్సవాల్లో ఎసీడీపీవో సమీరా

25-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్య సూచనలు పాటించాలని రామన్నపేట ఎసీడీపీవో సమీరా సూచించారు. మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మహిళా వారోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో సమీరా మాట్లాడుతూ తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకమని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు న్యూట్రిషన్‌పై అవగాహన కల్పించారు.

అనంతరం తల్లుల కోసం ఫుడ్ పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్య కార్యకర్తలు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హేమలత, ఏఎన్‌ఎంలు సాదియా, మంజుల, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి. మహిళా వారోత్సవాల్లో ఎసీడీపీవో సమీరా

Article Image

రామన్నపేట,

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్య సూచనలు పాటించాలని రామన్నపేట ఎసీడీపీవో సమీరా సూచించారు. మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మహిళా వారోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో సమీరా మాట్లాడుతూ తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకమని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు న్యూట్రిషన్‌పై అవగాహన కల్పించారు.

అనంతరం తల్లుల కోసం ఫుడ్ పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్య కార్యకర్తలు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హేమలత, ఏఎన్‌ఎంలు సాదియా, మంజుల, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News