Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:08 AM

ఘనంగా వనస్థలిపురం లో కేంబ్రిడ్జి మాంటెస్సోరి ప్రి స్కూల్ ప్రారంభం

ఘనంగా వనస్థలిపురం లో కేంబ్రిడ్జి మాంటెస్సోరి ప్రి స్కూల్ ప్రారంభం

   ఘనంగా వనస్థలిపురం లో కేంబ్రిడ్జి మాంటెస్సోరి ప్రి స్కూల్ ప్రారంభం
May 25, 2026 07:09 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

చిన్నారులకు ఉత్తమ విద్య ప్రమాణాలు అందించే దిశగా పాఠశాల ముందుకు సాగాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్యతో పాటు సృజనాత్మక అభివృద్ధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంబ్రిడ్జ్ మాంటెస్సోరి ప్రీ స్కూల్ వనస్థలిపురంలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహా రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జిట్ట రాజశేఖర్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై నిర్వాహకులతో కలిసి పాఠశాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారులకు ఉత్తమ విద్యా ప్రమాణాలు అందించే దిశగా పాఠశాల ముందుకు సాగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో అతిథులను యాజమాన్యం ఘనంగా సన్మానించింది. మాంటెస్సోరి, కేంబ్రిడ్జ్ విద్యా విధానాల ఆధారంగా రూపొందించిన ఈ విద్యాసంస్థలో కార్యాచరణ ఆధారిత బోధన, మైండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.

అలాగే పిల్లలకు అనుకూలమైన సురక్షిత వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్య అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక తరగతి గదులు, రవాణా సౌకర్యం, చిన్నారుల మానసిక వికాసానికి తోడ్పడే ప్రత్యేక కార్యక్రమాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిమిత అడ్మిషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ, డైరెక్టర్ మౌనిక హరినాథ్, అకాడమిక్ కోఆర్డినేటర్ లక్ష్మి, విష్ణుప్రియతల్లిదండ్రులు,శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News