Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:53 AM

లోకేష్ కృషితో ఏపీకి పెట్టుబడుల వెల్లువ. యువతకు లక్షల ఉద్యోగాలే లక్ష్యం : బెస్త రామాంజనేయులు

లోకేష్ కృషితో ఏపీకి పెట్టుబడుల వెల్లువ. యువతకు లక్షల ఉద్యోగాలే లక్ష్యం : బెస్త రామాంజనేయులు

లోకేష్ కృషితో ఏపీకి పెట్టుబడుల వెల్లువ.  యువతకు లక్షల ఉద్యోగాలే లక్ష్యం : బెస్త రామాంజనేయులు
May 26, 2026 08:18 AM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విశిష్ట స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు అన్నారు.

విజయవాడలోని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి భారీ పెట్టుబడులు తీసుకువస్తూ యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లేలా అనుకూల వాతావరణం సృష్టించారని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని వీడిన సంస్థలు సైతం మళ్లీ ఏపీ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ అమలుకు లోకేష్ కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.

ప్రాంతీయ అసమానతలు లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తున్నారని చెప్పారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్ర రూపురేఖలు మారుతున్నాయని, యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి కరువు, వలసలను నివారించాలని కోరారు.

దీనిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు బెస్త రామాంజనేయులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News