Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:18 PM

రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలి ఇన్‌చార్జి ఏడీఏ ఋషీంద్రమణి

26-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ, తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి ఏడీఏ ఋషీంద్రమణి సూచించారు. స్థానికంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

ఫార్మర్‌ రిజిస్ట్రీ ద్వారా రైతులకు ప్రత్యేకమైన 12 అంకెల డిజిటల్‌ ఐడీ లభిస్తుందని, ఇది ఆధార్‌ కార్డు తరహాలో ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధు, పీఎం కిసాన్‌, పంటల బీమా, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అవుతుందని వివరించారు.

గ్రామాల్లోని రైతు వేదికల వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) ఉచితంగా నమోదు చేస్తున్నారని, మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియ అందుబాటులో ఉందన్నారు.

రిజిస్ట్రేషన్‌కు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓలు ఎండి షఫీ, గోపి, రమేష్‌, రైతులు యాదమ్మ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలి ఇన్‌చార్జి ఏడీఏ ఋషీంద్రమణి

Article Image

మిర్యాలగూడ, తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి ఏడీఏ ఋషీంద్రమణి సూచించారు. స్థానికంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

ఫార్మర్‌ రిజిస్ట్రీ ద్వారా రైతులకు ప్రత్యేకమైన 12 అంకెల డిజిటల్‌ ఐడీ లభిస్తుందని, ఇది ఆధార్‌ కార్డు తరహాలో ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధు, పీఎం కిసాన్‌, పంటల బీమా, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అవుతుందని వివరించారు.

గ్రామాల్లోని రైతు వేదికల వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) ఉచితంగా నమోదు చేస్తున్నారని, మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియ అందుబాటులో ఉందన్నారు.

రిజిస్ట్రేషన్‌కు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓలు ఎండి షఫీ, గోపి, రమేష్‌, రైతులు యాదమ్మ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News