Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:26 AM

ఐదు తరాల కలయిక.. దుబ్బాకలో ఆత్మీయతల సందడి

25-05-2026 566 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుటుంబ బంధాలకు కొత్త ఊపిరి.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆదర్శంగా సమ్మేళనం

రామన్నపేట,

మారుతున్న కాలంతో ఉమ్మడి కుటుంబాల సంస్కృతి క్రమంగా కనుమరుగవుతున్న వేళ.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన గట్టు సాయమ్మ–ఈదయ్య కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదు తరాల సభ్యులు ఒకే వేదికపై కలుసుకుని ఆప్యాయతలు పంచుకోవడం అరుదైన ఘట్టంగా మారింది.

సాంకేతిక యుగ ప్రభావంతో కుటుంబ సభ్యుల మధ్య దూరాలు పెరుగుతున్న తరుణంలో పెద్దలు, యువత, చిన్నారులు కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. కుటుంబ మూలాలు, పూర్వీకుల సంప్రదాయాలు, పరస్పర గౌరవం, కుటుంబ విలువల గురించి పెద్దలు యువతకు వివరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చిన్నతరం పెద్దల ఆశీర్వాదాలు పొందగా.. పెద్దతరం తమ వారసులను చూసి ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, మృతి చెందిన కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ప్రదర్శించిన భావోద్వేగ వీడియో హాజరైన వారిని కంటతడి పెట్టించింది.

ఉన్నత ఉద్యోగులు, వైద్యులు, ఐటీ రంగ ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులుగా ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరడం విశేషంగా నిలిచింది. సమాజంలో పెరుగుతున్న స్వార్థ ధోరణుల మధ్య ఇలాంటి కుటుంబ సమ్మేళనాలు మానవ సంబంధాలకు కొత్త ఊపిరి పోస్తాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని ప్రతిబింబించిన ఈ సమ్మేళనం మరెన్నో కుటుంబాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.

Sthanikam

ఐదు తరాల కలయిక.. దుబ్బాకలో ఆత్మీయతల సందడి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News