Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:53 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ

26-05-2026 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​ రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న పురపాలక వైస్ చైర్మన్

నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశం

​చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను తనిఖీ చేసిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించారు.​అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో వినయ్ కుమార్ నేరుగా మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితులను, ఆసుపత్రిలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పేద ప్రజలకు నమ్మకమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని వైస్ చైర్మన్ పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నాణ్యమైన చికిత్స, మందులు సకాలంలో అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు.

​ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందేలా తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, మున్సిపల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News