Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:08 PM

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి

26-05-2026 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో పనిచేస్తోందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి తెలిపారు. మంగళవారం సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాల సభ్యులకు రూ.2 కోట్ల మేర వడ్డీ లేని రుణాలను అందించినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేసిందని, వడ్డీ లేని రుణాలు సక్రమంగా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పారదర్శకంగా రుణాలు అందిస్తూ స్వయం ఉపాధికి ప్రోత్సాహం ఇస్తోందన్నారు.ఇందిరా శక్తి పథకం కింద ఇప్పటికే 119 మందికి రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.అలాగే సంగారెడ్డి పట్టణంలో 212 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో అనర్హులకు కేటాయింపులు చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేసే విధంగా పనిచేస్తోందన్నారు. అధికారులు,ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు.ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు రెండు రంగుల్లో ప్రత్యేక చీరలను పంపిణీ చేస్తోందని, సంగారెడ్డి పట్టణంలో సుమారు 29 వేల మంది మహిళలకు చీరలు అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూన వనిత, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టీఎంసీ విజయభారతి, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News