Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:31 AM

ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి భద్రత కల్పించాలి: ఐలు నేత మామిడి వెంకట్ రెడ్డి

25-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యాయవాది హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలి.

న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌పై పథకం ప్రకారం కారుతో దాడి చేసి హత్య చేసిన దుండగులతో పాటు వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌కు ముందునుంచే బెదిరింపులు, దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు సరైన భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరణించిన న్యాయవాది కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ న్యాయవాదులపై దాడులు కొనసాగుతున్నాయని, ఇవి రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

వ్యక్తులను హత్య చేస్తే న్యాయం ఆగిపోదని, న్యాయవాదులపై దాడి చేసే సంస్కృతికి ముగింపు పలకాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి ఐలు తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యాదాసు యాదయ్య, ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, గడ్డం నర్సయ్య, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి భద్రత కల్పించాలి: ఐలు నేత మామిడి వెంకట్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News