Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:09 AM

యువతను డ్రగ్స్ బారిన పడనీయొద్దు: అధికారులకు అదనపు కలెక్టర్ సూచన

13-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు.మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతోందని పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో కలిసి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ,యువత మాదకద్రవ్యాల రవాణా చేసినా, వినియోగించినా కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల నియంత్రణకు జిల్లాలోని అన్ని కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.మాదకద్రవ్యాల అలవాటు యువత భవిష్యత్తును చీకటిలోకి నెడుతుందని, ఎవరూ ఆ బానిసత్వానికి లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం లేదా రవాణా జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.అర్బన్, రూరల్ అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, వాటి ప్రభావం గురించి ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలోని విద్యాసంస్థలు, బస్ స్టాండ్లు, యువత ఎక్కువగా చేరే ప్రాంతాలు వంటి డ్రగ్స్ వినియోగానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.డ్రగ్స్‌తో పాటు గుడుంబా వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు కూడా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కళాశాలల్లో ఏర్పాటు చేసిన డ్రగ్స్ నిరోధక కమిటీలు మరింత చురుకుగా పనిచేస్తూ విద్యార్థుల్లో అవగాహన పెంచాలని పేర్కొన్నారు.సమావేశంలో జిల్లాలో డ్రగ్స్ నిరోధానికి వివిధ శాఖలు, విద్యాసంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో గీతం యూనివర్సిటీ, మహేశ్వర మెడికల్ కళాశాల, ఎమ్మెన్నార్ విద్యాసంస్థలు, వోక్సిన్ యూనివర్సిటీ ప్రతినిధులు, డీడబ్ల్యువో, డీసీహెచ్ఎస్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ఆర్టీసీ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ అధికారులు, ఆటో యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువతను డ్రగ్స్ బారిన పడనీయొద్దు: అధికారులకు అదనపు కలెక్టర్ సూచన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News