Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

యాదగిరిగుట్టలో వైభవంగా పూర్ణాహుతి,చక్రతీర్థ స్నాన ఘట్టం

27-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల పదవ రోజున పూర్ణాహుతి, చక్రతీర్థ స్నాన ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఉదయం లక్ష్మీ సమేత నరసింహ స్వామివారిని ఆలయం నుంచి కొండపై ఉన్న విష్ణు పుష్కరిణి వరకు ప్రత్యేక సేవలో తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల నడుమ అర్చకులు విష్ణు పుష్కరిణిలో చక్రస్నానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై చక్రతీర్థ స్నానంలో పాల్గొన్నారు.ఫిబ్రవరి 18న స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 28న అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి.పాంచరాత్రాగమ శాస్త్రానుసారం ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, అర్చక బృందం, వేద పండితులు,యజ్ఞా చార్యులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో జే. భవాని శంకర్,అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి తదితర అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Sthanikam

యాదగిరిగుట్టలో వైభవంగా పూర్ణాహుతి,చక్రతీర్థ స్నాన ఘట్టం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News