Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:34 AM

వృద్ధురాలి మెడలో చైన్ లూటీ చేసిన విద్యుత్ శాఖ ప్రభుత్వ ఉద్యోగి

28-02-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు మండలంలో సంచలనం – నిందితుడి అరెస్ట్

ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం రేపిన చైన్ దోపిడీ ఘటనను పోలీసులు చేధించారు. తిరువూరు మండలం చిక్కుళ్ళగూడెం గ్రామంలో వృద్ధురాలు ఉప్పు అనసూర్య మెడలో ఉన్న సుమారు నలభై గ్రాముల బంగారు నాన్తాడు చెయిన్‌ను లాక్కెళ్లిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు.

విచారణలో నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కావడం కలకలం రేపింది. విజయవాడకు చెందిన అసిస్టెంట్ లైన్మన్ నంద సుభాష్ ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉద్యోగంలో కొనసాగుతూనే చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.

దోపిడీకి వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని గానుగపాడు గ్రామంలో కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మీపురం శివారులో నిందితుడిని అదుపులోకి తీసుకుని, బంగారు చెయిన్‌తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ వివరాలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే. గిరిబాబు మీడియాకు వెల్లడించారు. సమావేశంలో ఉప ఇన్‌స్పెక్టర్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగి నేరానికి పాల్పడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

వృద్ధురాలి మెడలో చైన్ లూటీ చేసిన విద్యుత్ శాఖ ప్రభుత్వ ఉద్యోగి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News