Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:12 PM

వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణకు భారీగా హాజరైన అభిమానులు

01-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్‌బీ నగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ ఎన్‌జీఓస్ కాలనీలోని కాపు సంఘం భవనం వద్ద పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగాగారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎల్‌బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు.

అతిథులు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రంగాగారి సేవలను స్మరించుకుంటూ ఆయన బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన పోరాటం ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రంగాగారి అభిమానులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో కొనసాగింది.

Sthanikam

వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణకు భారీగా హాజరైన అభిమానులు

Article Image

ఎల్‌బీ నగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ ఎన్‌జీఓస్ కాలనీలోని కాపు సంఘం భవనం వద్ద పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగాగారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎల్‌బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు.

అతిథులు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రంగాగారి సేవలను స్మరించుకుంటూ ఆయన బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన పోరాటం ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రంగాగారి అభిమానులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News