Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

విస్సన్నపేటలో సిపిఐ ధర్నా మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి: మర్సకట్ల త్యాగరాజు

01-03-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట: రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం విస్సన్నపేట స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ విస్సన్నపేట మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను దోపిడీ చేస్తున్న ఇలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కల్తీ మందులు సరఫరా చేస్తున్న మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జనరిక్ మందులపై అధిక ధరలను అరికట్టాలని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

లేనిపక్షంలో సిపిఐ పార్టీ భవిష్యత్తులో నిరంతర ఉద్యమాలకు దిగుతుందని త్యాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాజేష్, పి. నాగేశ్వరరావు పాల్గొని నాయకత్వం వహించారు.

Sthanikam

విస్సన్నపేటలో సిపిఐ ధర్నా మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి: మర్సకట్ల త్యాగరాజు

Article Image

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట: రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం విస్సన్నపేట స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ విస్సన్నపేట మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను దోపిడీ చేస్తున్న ఇలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కల్తీ మందులు సరఫరా చేస్తున్న మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జనరిక్ మందులపై అధిక ధరలను అరికట్టాలని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

లేనిపక్షంలో సిపిఐ పార్టీ భవిష్యత్తులో నిరంతర ఉద్యమాలకు దిగుతుందని త్యాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాజేష్, పి. నాగేశ్వరరావు పాల్గొని నాయకత్వం వహించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News