Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:08 AM

వేసవిపై ముందస్తు అప్రమత్తత – మండలాల వారీగా కలెక్టర్ సమీక్ష

27-02-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా సమగ్ర ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సరఫరా నిరంతరంగా అందేలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లు, టూ బిహెచ్కే గృహాలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు, గ్రామీణ త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొని మండల వారీగా ప్రగతిని వివరించారు.వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి గ్రామంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బోర్‌వెల్స్ ఫ్లషింగ్, మోటార్ల మరమ్మత్తులు, పైపుల లీకేజీల నివారణ, నిల్వ ట్యాంకుల శుభ్రపరిచే పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం గ్రామపంచాయతీ నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించి, ఎక్కడైనా కలుషిత సమస్యలు ఉంటే వెంటనే నివేదించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తరచూ నీటి సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామాలను ఎంపీడీవోలు స్వయంగా సందర్శించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకుని శాశ్వత పరిష్కార మార్గాలు అమలు చేయాలని సూచించారు.ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మెటీరియల్ కంపోనెంట్‌కు అనుగుణంగా లేబర్ వినియోగాన్ని పెంచి, షెల్ఫ్ ఆఫ్ వర్క్స్‌ను సమర్థంగా అమలు చేయాలని ఎంపీడీవోలకు ఆదేశించారు. చేపట్టిన పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి గ్రామీణ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అంగన్వాడి భవనాల నిర్మాణాన్ని పాఠశాల ప్రాంగణాల్లో మార్కింగ్ చేసి వెంటనే గ్రౌండింగ్ చేయాలని తెలిపారు. స్కూల్ టాయిలెట్లు, అంగన్వాడి భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, పాఠశాల కాంపౌండ్ గోడల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరులు అందేలా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.పెండింగ్‌లో ఉన్న ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని, అవసరమైతే స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని సూచించారు. చెల్లింపుల సమస్యలు ఉంటే వెంటనే వివరాలు సమర్పించాలని అధికారులకు తెలిపారు. టూ బిహెచ్కే గృహాల కోసం ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్-2 లబ్ధిదారుల జాబితాను సేకరించి సమర్పించాలని ఆదేశించారు.జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు సమయానికి పూర్తయ్యేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హితవు పలికారు.ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీఆర్డీఓ జ్యోతి, హౌసింగ్ పీడీ చలపతిరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రఘువీర్, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అధికారులు, హౌసింగ్ ఏఈలు, ఎంపీఓలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వేసవిపై ముందస్తు అప్రమత్తత – మండలాల వారీగా కలెక్టర్ సమీక్ష

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News