Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

వేమిరెడ్డిపల్లి–పుట్రేల రహదారి దుస్థితి: సీపీఎం ఆధ్వర్యంలో రోడ్డుదిగ్బంధం

28-02-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వేమిరెడ్డిపల్లి నుంచి పుట్రేల గ్రామానికి వెళ్లే ప్రధాన తారు రహదారి దారుణ స్థితికి చేరడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం (సీపీఎం) నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుదిగ్బంధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

గ్రామస్తుల కథనం ప్రకారం, గత 30 ఏళ్లుగా వేమిరెడ్డిపల్లి–పుట్రేల మధ్య తారు రహదారి ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో పూర్తిగా గుంతలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనదారులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మరమ్మత్తులు చేస్తామని కొలతలు వేసినా పనులు ప్రారంభం కాలేదని సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు ఆరోపించారు. వేమిరెడ్డిపల్లి బొడ్రాయి నుంచి పుట్రేల వరకు తారు రహదారిని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గతంలో భారీ వాహనాలు సంచరించడం వల్ల రహదారి పూర్తిగా దెబ్బతిందని తెలిపారు.

ఏడు గ్రామాల కలయికగా ఉన్న వేమిరెడ్డిపల్లి నుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి మరమ్మత్తులు చేపట్టాలని నాయకులు కోరారు.

ఈ నిరసనలో సీపీఎం నాయకులు మోరంపూడి రామారావు, కరెడ్ల ధనలక్ష్మి, గ్రామస్తులు మోరంపూడి కోటేశ్వరరావు, చెన్నారావు, ఆదం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వేమిరెడ్డిపల్లి–పుట్రేల రహదారి దుస్థితి: సీపీఎం ఆధ్వర్యంలో రోడ్డుదిగ్బంధం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News