Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:14 PM

వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత అదే స్థలంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టాలి అఖిలపక్ష ఆధ్వర్యంలో వినతి

01-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం, ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఇండ్ల కూల్చివేత ఘటనపై అఖిలపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలుగా పేద కుటుంబాలు నివసిస్తున్న భూమిలో నిర్మించుకున్న ఇండ్లను ఈనెల 24వ తేదీ తెల్లవారుజామున భారీ పోలీసు బలగాల మోహరింపుతో ప్రభుత్వం కూల్చివేసిందని ఆరోపించారు.

సుమారు 31 ఎకరాలు 7 గుంటల భూమిలో 600కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని, దాదాపు 2 వేల మందికి పైగా ప్రజలు జీవనాధారం ఏర్పరుచుకున్నారని తెలిపారు. ఆధునిక యంత్రాలతో ఇండ్లను ధ్వంసం చేయడమే కాకుండా, దీనిని వ్యతిరేకించిన మహిళలు, ప్రజలు, రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శించారు.

ఈ ఘటనపై ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసి అఖిలపక్ష నాయకులు పలు డిమాండ్లు వినిపించారు.

డిమాండ్లు:

ఇండ్ల కూల్చివేతకు గురైన ప్రతి కుటుంబానికి ఎలాంటి షరతులు లేకుండా అదే స్థలంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.

నిర్వాసిత కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయంగా ఒక్కొక్కరికీ రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలి.

ఉపాధి అవకాశాలు కల్పించాలి.

నిర్వాసితులపై, రాజకీయ నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలి.

ఇళ్లు నిర్మించే వరకు ప్రభుత్వమే తాత్కాలిక వసతి సౌకర్యాలు కల్పించాలి.

ఈ కార్యక్రమంలో Communist Party of India, Communist Party of India (Marxist), Communist Party of India (Marxist-Leninist) New Democracy, మాస్ లైన్ జిల్లా నాయకత్వం పాల్గొన్నారు. దండి సురేష్, నరసింహారావు, పోతినేని సుదర్శన్, నున్న నాగేశ్వరరావు, అవునూరి మధు, గోకినపల్లి వెంకటేశ్వరరావు, సివై పుల్లయ్య, వై ప్రకాష్, వై విక్రం, ఝాన్సీ శిరోమణి, ఎస్‌కే కాశీం, గొర్రెపాటి రమేష్, శ్రీనివాస్, రామయ్య, శ్రావణ్, చింతల రమేష్, బషీర్, మస్తాన్, శ్రీకాంత్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత అదే స్థలంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టాలి అఖిలపక్ష ఆధ్వర్యంలో వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News