Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:08 AM

వ్యవసాయంలో యాంత్రీకరణకు వేగం పెంచాలి – కలెక్టర్ సూచనలు

23-03-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వ్యవసాయ యాంత్రీకరణతో రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కీలక సూచనలు చేశారు.యాంత్రీకరణ, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి, తేనెటీగల పెంపకం పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తే రైతులకు అధిక లాభాలు అందుతాయని తెలిపారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన యాంత్రీకరణ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని, ఇప్పటివరకు సాధించిన పురోగతికి సంబంధించిన వినియోగ ధ్రువపత్రాలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరిగేలా పర్యవేక్షణ పెంచాలని సూచించారు.రైతులను యాంత్రీకరణ వైపు ప్రోత్సహించడం ద్వారా కూలి ఖర్చులు తగ్గి, వ్యవసాయ పనులు వేగంగా పూర్తవుతాయని,ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా చిన్న ట్రాక్టర్లు,గడ్డి తొలగించే యంత్రాలు, నేల దున్నే యంత్రాలు,చెట్లు కత్తిరించే పరికరాలు,మందులు పిచికారీ చేసే యంత్రాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, జిల్లాలో ఇప్పటికే 97 యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.వర్షాధార ప్రాంతాల అభివృద్ధి పథకం ద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే లక్ష్యమని వివరించారు.ఈ పథకం కింద పంటల విభిన్నీకరణ,పశుపోషణ,

ఉద్యానవనం వంటి సమగ్ర వ్యవసాయ విధానాలను అమలు చేయాలని సూచించారు.సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు.తేనెటీగల పెంపకం కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.ఎక్కువ మంది రైతులకు తేనెటీగల పెట్టెలు అందేలా చర్యలు తీసుకోవాలని,ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రోత్సహించాలని గ్రామీణ అభివృద్ధి అధికారులకు సూచించారు.వాణిజ్య స్థాయిలో తేనె ఉత్పత్తి చేసే కేంద్రాలు ఏర్పాటు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.ఈ సమావేశంలో గ్రామీణ అభివృద్ధి అదనపు కార్యదర్శి సూర్యరావు, ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు,జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్,ఎస్సీ సంస్థ అధికారి రామాచారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యవసాయంలో యాంత్రీకరణకు వేగం పెంచాలి – కలెక్టర్ సూచనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News