Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం అభినందనీయం:మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

26-04-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ సాయిబాబా మందిరంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ హాజరై పూర్ణకుంభ స్వాగతం స్వీకరించి వాసవీ మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యుల చిరకాల కోరికను నెరవేర్చుతూ వాసవీ మాత జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాసవీ మాత చూపిన అహింసా మార్గం, ధర్మబోధలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద, మహేందర్, లక్ష్మణ్, మాణిక్ ప్రభు, సత్యం షెట్, బద్రి షెట్, నవతా నర్సింలు, నారాయణ షెట్, సతీష్, పాండు మహేష్ షెట్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం అభినందనీయం:మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ సాయిబాబా మందిరంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ హాజరై పూర్ణకుంభ స్వాగతం స్వీకరించి వాసవీ మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యుల చిరకాల కోరికను నెరవేర్చుతూ వాసవీ మాత జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాసవీ మాత చూపిన అహింసా మార్గం, ధర్మబోధలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద, మహేందర్, లక్ష్మణ్, మాణిక్ ప్రభు, సత్యం షెట్, బద్రి షెట్, నవతా నర్సింలు, నారాయణ షెట్, సతీష్, పాండు మహేష్ షెట్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News