Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:08 AM

వర్షాకాలం ముందు చర్యలు తీసుకోండి – గ్రామస్థుల విజ్ఞప్తి

13-04-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండలం రాజారాం తాండలో ఇండ్లపైగా వెళ్లుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారడంతో గ్రామస్థులు సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాలి వేగంగా వీచే సమయంలో ఈ తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు పడుతున్నాయని, దీంతో ఎప్పుడైనా అగ్ని ప్రమాదం లేదా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు. చిన్నపిల్లలు బయట ఆడుకోవడానికి కూడా భయపడుతున్నారని, కుటుంబ సభ్యులు నిరంతరం భయాందోళనల మధ్య జీవిస్తున్నారని తెలిపారు. బాధితుడు సజన్ లాల్ మాట్లాడుతూ ఇళ్లపైగా ఉన్న ఈ విద్యుత్ లైన్లు ఎప్పుడైనా తెగిపడి ప్రమాదం కలిగించే అవకాశముందని, ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఇప్పటికే గ్రామ సర్పంచ్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తెలియజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అందువల్ల సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ తీగలను తొలగించి సురక్షిత ప్రాంతానికి మార్చాలని, ఆలస్యం చేస్తే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ తమ ప్రాణాలు, ఆస్తులను కాపాడాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

వర్షాకాలం ముందు చర్యలు తీసుకోండి – గ్రామస్థుల విజ్ఞప్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News